గాయపడిన వ్యక్తి మృతి
భద్రాచలంఅర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం రాత్రి మృతి చెందాడు. వివరాలు ఇలా.. భద్రాచలం బ్రిడ్జి పాయింట్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రాజేష్, కిరణ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, రాజేష్ అప్పటికే మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం కిరణ్‌ను ఖమ్మం తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. కాగా ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా పుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చికిత్స పొందుతున్న పోస్టల్ ఉద్యోగి...
ములకలపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పోస్టల్ ఉద్యోగి చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఎస్సై కిన్నెర రాజశేఖర్ కథనం ప్రకారం.. ములకలపల్లిలో నివసించే భాస్కరిణి రామరాజు (57) పొగళ్లపల్లిలో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ఏబీపీఎం)గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూలాగానే శుక్రవారం విధులకు హాజరై తిరిగి సహఉద్యోగితో కలిసి బైక్‌పై ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో కంపగూడెం ప్రభుత్వ పాఠశాల సమీపంలో వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో రామరాజుకు తీవ్రగాయాలు కాగా, ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య సుబ్బలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గడ్డి మందు తాగిన వివాహిత...
పాల్వంచరూరల్: కడుపు నొప్పి తాళలేక గడ్డిమందు తాగిన వివాహిత మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మందరెకలపాడు గ్రామానికి చెందిన కాటి సాంబలక్ష్మి(43) రెండేళ్ల నుంచి కడుపు నొప్పి, థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది. నొప్పి తట్టుకోలేక ఆదివారం ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా, చికిత్స అందించారు. అక్కడి నుంచి ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలు భర్త కాటి నర్సింహారావు ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.సురేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment