15 కేజీల గంజాయి సీజ్
బూర్గంపాడు: సారపాక పల్లె ప్రకృతి వనం సమీపంలో ఆదివారం రాత్రి పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. పాల్వంచ సీఐ వినయ్‌కుమార్ కథనం ప్రకారం.. బూర్గంపాడు ఎస్‌ఐ రాజేష్ ఆదివారం రాత్రి సారపాక పల్లె ప్రకృతి వనం వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో పోలీసులు ఆపి తనిఖీలు చేపట్టారు. కారులో 15.3 కిలోల గంజాయి ఉండగా, స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌తోపాటు వాహనంలో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా కలిమిలకు చెందిన డ్రైవర్ శ్యామల్ సర్కార్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దీవన్ష్‌సింగ్ కుస్వ, మున్షి కుస్వ, రాజ్‌పాల్ కుస్వలు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలింది. చింతూరు నుంచి మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు విచారణలో అంగీకరించారు. కారు, ఐదు సెల్‌ఫోన్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్ల సీఐ తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ 3.82 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
ఊట్లపల్లి వద్ద 10.4 కిలోలు..
అశ్వారావుపేట: భద్రాచలం నుంచి ఖమ్మానికి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఖమ్మం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది సోమవారం పట్టుకున్నారు. ఎకై ్సజ్ అధికారుల కథనం ప్రకారం.. భద్రాచలం నుంచి పాల్వంచ మీదుగా గంజాయి రవాణాను అధికారులు అడ్డుకుంటున్న నేపథ్యంలో అశ్వారావుపేట మీదుగా తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఖమ్మం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సీహెచ్ శ్రీనివాస్, అశ్వారావుపేట ఎకై ్సజ్ సీఐ రాజశేఖరరావు, సిబ్బంది మండలంలోని ఊట్లపల్లి వద్ద కాపు కాశారు. ఖమ్మం ముస్తఫా నగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు రెండు బైక్‌లపై తరలిస్తున్న 10.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ములకలపల్లి ఉదయ్, ములకలపల్లి గోపీచంద్‌లను అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారయ్యాడు. రెండు బైక్‌లను స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment