‘పాలకవర్గాని’కి మళ్లీ దరఖాస్తులు.. | - | Sakshi
Sakshi News home page

‘పాలకవర్గాని’కి మళ్లీ దరఖాస్తులు..

Published Tue, Nov 26 2024 2:13 AM | Last Updated on Tue, Nov 26 2024 2:13 AM

‘పాలకవర్గాని’కి మళ్లీ దరఖాస్తులు..

‘పాలకవర్గాని’కి మళ్లీ దరఖాస్తులు..

●మార్చి 24న ముగిసిన పెద్దమ్మగుడి పాలకవర్గ పదవీకాలం ●అప్పుడే నోటిఫికేషన్‌ జారీ చేయగా, పలువురి దరఖాస్తులు ●ఈ నెల 22న మరోసారి నోటిఫికేషన్‌ ఇచ్చిన దేవాదాయ శాఖ

పాల్వంచరూరల్‌: పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి పాలకవర్గం పదవీ కాలం ఈ ఏడాది మార్చి 24న ముగిసింది. దీంతో నూతన పాలకమండలి నియామకానికి ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ నోటిఫికేషన్‌ జారీచేయడంతో పదవుల కోసం పోటాపోటీగా 52 మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా రెండోసారి ఈ నెల 22న పాలక మండలి నియామకం కోసం ఏసీ వీరస్వామి నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో పదవులు ఆశించే నాయకులు మరోసారి దరఖాస్తు చేసుకోవాలా? గతంలో చేసుకున్న దరఖాస్తులను పరిగణనలో తీసుకుంటారా? అని తర్జనభర్జన పడుతున్నారు.

52 దరఖాస్తులు

జిల్లాలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం తర్వాత అంతటి భక్తుల రద్దీ, ఆదాయం కలిగిన పాల్వంచ మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) దేవస్థానం పాలకవర్గ పదవీకాలం మార్చి 24న ముగిసిపోయింది. నూతన పాలకవర్గం ఎన్నిక కోసం దేవాదాయ శాఖ ఫిబ్రవరి 20నే నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో పాల్వంచ, కొత్తగూడెం పట్టణ, మండలాల పరిధిలోని అధికార పార్టీ శ్రేణులు 52మంది దరఖాస్తు చేసుకున్నట్లు అప్పటి ఎండోమెంట్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సులోచన తెలిపారు. అయితే ఆ నోటిఫికేషన్‌ రద్దు చేసి తాజాగా గత శుక్రవారం ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వీరస్వామి మరోసారి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆశావహులు 20 రోజుల్లోగా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. అయితే గతంలో దరఖాస్తులు చేసుకున్న దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారా లేక మరోసారి దరఖాస్తు చేసుకోవాలా అని తికమకపడుతున్నారు. కాగా గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి పాలకవర్గం పదవుల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అధికార పార్టీకి చెందిన పలువర్గాల వారు పాలకవర్గంలో చోటు కోసం తీవ్రప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పాతవి పరిగణనలోకి తీసుకోం

పెద్దమ్మగుడి నూతన పాలక వర్గం నియామకం కోసం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దయింది. కమిషనర్‌ ఆదేశాల మేరకు 22న మరోసారి నోటిఫికేషన్‌ జారీ చేశాం. నోటిఫికేషన్‌ జారీ అయిన 20 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో చేసుకున్న దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబోం. – వీరస్వామి,

ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఖమ్మం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement