ముంబై: హైదరాబాద్ కంపెనీ 3ఎఫ్ ఆయిల్ పామ్ అరుణాచల్ ప్రదేశ్‌లో రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా సమీకృత ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు ఇప్పటికే 120 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలియజేసింది. పిబ్రవరిలో సొంతం చేసుకున్న భూమికి సంబంధించి నియంత్రణ సంస్థల ఆమోదంసహా అవసరమైన అన్ని రకాల అనుమతులను పొందినట్లు వెల్లడించింది.
రెండు దశలలో ప్లాంటును నెలకొల్పనున్నట్లు తెలియజేసింది. స్థానికంగా 300 మందికి ఉపాధి కల్పించగల తొలి దశను 2023 సెప్టెంబర్‌కల్లా పూర్తిచేయగలమని భావిస్తున్నట్లు అభిప్రాయపడింది. పామాయిల్ ప్రాసెసింగ్ రిఫైనరీ, వ్యర్ధరహిత యూనిట్(జీరో డిశ్చార్జ్), పామ్ వ్యర్ధాలతో విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ప్రస్తుత కంపెనీ నర్సరీ, పంటల నిర్వహణ, ఎఫ్‌ఎఫ్‌బీ హార్వెస్టింగ్, కలెక్షన్ తదితర రైతు అనుబంధ సర్వీసులకు మద్దతిస్తుందని తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment