న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరో సేల్ ని 'మెగా శాలరీ డేస్' పేరుతో ప్రకటించింది. 'మెగా శాలరీ డేస్' సేల్ 2021 జనవరి 1న ప్రారంభమై జనవరి 3 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో భాగంగా అమెజాన్ రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఫర్నిచర్, స్పోర్ట్స్ ప్రొడక్ట్స్, గృహోపకరణాలు, బొమ్మలు, ఇంకా చాలా ఇతర ఉత్పతులు ఉన్నాయి. శామ్సంగ్, ఎల్జీ, వర్పూల్, గోద్రేజ్, సోనీ, జెబిఎల్ వంటి బ్రాండ్ల ఉత్పత్తుల మీద తగ్గింపు ధరలు, ఆఫర్లు లభిస్తాయి. ఇంకా, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐలను ఉపయోగించి కొనుగోలు చేసే వారికీ వినియోగదారులకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ కింద రూ.1,250 వరకు లభిస్తాయి. (చదవండి: వారిపై ఎలాంటి జరిమానాలుండవు)
అమెజాన్ 'మెగా శాలరీ డేస్' సేల్ లో బోట్, సోనీ, జెబీఎల్ వంటి బ్రాండ్ల హెడ్‌ఫోన్‌లు 50 శాతం తగ్గింపు ధరతో లభిస్తాయి. బోస్, సోనీ, హర్మాన్ కార్డాన్ వంటి ప్రీమియం హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లు 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ కింద లభిస్తాయి. బోట్, జెబిఎల్, షియోమి కంపెనీల సౌండ్ బార్‌లు 30 శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి. ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల ధరలపై రూ.30,000 వరకు తగ్గింపు లభిస్తుంది. రూ.27,990 ప్రారంభ ధర గల డీఎస్‌ఎల్‌ఆర్‌లు, మీర్రర్‌లెస్, పాయింట్ షూట్ కెమెరాలు ఈఎంఐ ఎంపికలతో 27,990. స్మార్ట్ వాచీలు మరియు ఫిట్నెస్ ట్రాకర్లను 40 శాతం ఆఫ్ ధరలకు అందిస్తారు. అమెజాన్ 'మెగా శాలరీ డేస్' సేల్ లో పెద్ద ఉపకరణాల మీద 40 శాతం వరకు, ఉత్తమంగా అమ్ముడైన వాషింగ్ మెషీన్లలో 35 శాతం వరకు, ఎయిర్ కండీషనర్లపై 35 శాతం వరకు, మైక్రోవేవ్లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. వీటితో పాటు మరెన్నో ఉత్పత్తుల మీద చాలా వరకు ఆఫర్లు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment