
ప్రపంచ దేశాల్లో క్రికెట్‌ను ఓ మతంలా భావించే కోట్లాది మంది అభిమానుల్లో ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఒకరు. అలాంటి క్రికెట్ అభిమాని దేశంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పోటీలు జరుగుతుంటే చూస్తూ ఉంటారా? అందుకే టీమిండియా జెర్సీని షేర్ చేస్తూ ఐయాం రెడీ.. థ్యాంక్యూ బీసీసీఐ అంటూ ఆనంద్ మహీంద్రా (ఎక్స్‌లో) పోస్టు పెట్టారు.
దానిపై ఆనంద్ 55అని రాసి ఉంది. ఈప్రత్యేక జెర్సీని బీసీసీఐ ఆనంద్ మహీంద్రాకు బహూకరించింది. అయితే, ఇంతకీ ఆ 55 నెంబర్ ప్రత్యేకత ఏంటా అని తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు 55 ఆనంద్ మహీంద్రా లక్కీ నెంబర్ అని ఊహించించారు. ఊహాగానాల మధ్య, ఆనంద్ మహీంద్రా 55 రహస్యాన్ని రివిల్ చేశారు. ఓ పోస్ట్‌లో,‘మీరందరూ చాలా సింపుల్‌గా కనిపెట్టారే! అవును. నా పుట్టిన తేదీ 1-5-55. 5 ఎల్లప్పుడూ నా అదృష్ట సంఖ్య.
I’m READY….
— anand mahindra (@anandmahindra) October 5, 2023
Thank you @bcci @tech_Mahindra (digital partners of BCCI ) @c_p_gurnani @mohitjoshi74 @manishups08 pic.twitter.com/ip73oTMDlj
అదే సమయంలో 1991లో మహీంద్రా అండ్ మహీంద్రాలో చేరినప్పుడు కంపెనీ లక్కీ నెంబర్ 5 అని తెలుసుకున్నట్లు చెప్పారు. పైగా అదే 5 నెంబర్‌ను మహీంద్రా విడుదల చేసిన తొలి ట్రాక్టర్ నెంబరింగ్‌లో ఉపయోగించారు’ అని ట్వీట్ చేశారు. కాగా, మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ఐటీ విభాగం టెక్ మహీంద్రా బీసీసీఐకి డిజిటల్ పార్టనర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.