దేశంలో స్టాక్ మార్కెట్‌లు లాభాల్లో పయనిస్తున్నాయి. దీంతో పెట్టుబడి దారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వివిధ మార్గాల్లో పెట్టు బడులు పెట్టిన మదుపర్లు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వెరసీ ఈ అక్టోబర్ నెలకి డీమ్యాట్ అకౌంట్‌ల సంఖ్య వార్షిక (ఏడాది) ప్రాతిపదికన 41 శాతం పెరిగి 10.4 కోట్లకు చేరినట్లు మోతీలాల్ ఓస్వల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది.
అయితే ద్రవ్యోల్బణం, రేట్ల పెంపు, ఆర్థికమాంద్యం వంటి అనిశ్చితి పరిస్థితుల కారణంగా గత కొద్ది నెలలుగా డీమ్యాట్ అకౌంట్‌లు తీసుకునే వారి సంఖ్య తగ్గిపోతుందని ఓస్వల్ నివేదిక వెల్లడించింది. ఆగస్టులో 26 లక్షలు అకౌంట్లను ఓపెన్ చేయగా ..సెప్టెంబరులో 20 లక్షలు, అక్టోబరు 18 లక్షలకు తగ్గాయని తెలిపింది. గత ఏడాది అక్టోబరులో కొత్త ఖాతాల సంఖ్య 36 లక్షలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment