లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Mon, Apr 29 2024 8:42 AM | Last Updated on Mon, Apr 29 2024 9:20 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 22,497కు చేరింది. సెన్సెక్స్‌ 298 పాయింట్లు దిగజారి 74,021 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 106.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 88.2 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.67 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.02 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 2 శాతం ఎగబాకింది.

ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలు ఉండనున్నాయి. దాంతోపాటు బుధవారం వడ్డీరేట్లపై  వెల్లడయ్యే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎంపిక చేసిన షేర్లు, రంగాల్లో కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement