
జాతీయ, అంతర్జాతీయ సానుకూల అంశాలు దేశీయ స్టాక్ సూచీలపై ప్రభావాన్ని చూపాయి. దీంతో మంగళవారం ఉదయం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 32 పాయింట్లు లాభపడి 66567 వద్ద, నిఫ్టీ అత్యంత స్వల్పంగా 10 పాయింట్లు లాభపడి 19764 వద్ద కొనసాగుతుంది.
ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా,ఎథేర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, సిప్లా, హీరో మోటో కార్ప్,హెచ్‌సీఎల్ టెక్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, దివిస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్స్, యూపీఎల్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి..