పెండింగ్ బిల్లుల చెల్లింపునకు చర్యలు
– జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా పరిషత్ పరిధిలో ఐదేళ్ల ముందు చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. గురువారం ఆయన సీఈఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో సీఎం చంద్రబాబు పాలనలో చేసిన 402 పనులకుగాను రూ.7 కోట్లు బిల్లులు ఇవ్వాల్సి ఉందన్నారు. వాటిని చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటి వరకు 60 పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన వాటిని అప్‌లోడ్ చేసే పనిలో సిబ్బంది ఉన్నారని, ఈ నెలలోపు వాటిని చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మండల పరిషత్, గ్రామ సచివాలయాల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, ఇటీవల పులిచెర్ల, పలమనేరు, గంగవరం, విజయపురం, పెనుమూరు మండలాల్లో మండలపరిషత్, గ్రామ సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. అదేవిధంగా జెడ్పీ పాఠశాలలు, అక్కడ అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేయనున్నట్లు పేర్కొన్నారు. విధి నిర్వహణలో తప్పుచేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. ఎంపీడీఓలు వారి పరిధిలో ఉన్న కార్యాలయాలను అకస్మికంగా తనిఖీ చేసి నివేదికలు అందజేయాలని కోరారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
పుంగనూరు: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నినికి పాల్పడిన ఘటన పట్టణంలో వెలుగు చూసింది. గురువారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో పనిచేసే టెక్నీషియన్ తులసి కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఇంటిలో యాసిడ్ తాగింది. గమనించిన భర్త వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కో సం మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. పోలీసు లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment