No Headline
సమస్యలు తప్పడం లేదు..
గత ఐదారేళ్లుగా పట్టుగూళ్ల ధరలు మాత్రం పెరగలేదు. గతంలో పట్టుపురుగుల పెంపకానికి వచ్చే వారికి కూలి రూ.200. ఇప్పుడు మనిషికి రూ.600 ఇస్తామన్నా పనులకు రావడం లేదు. దీంతో రైతులకు కూలీల సమస్య ఎక్కువైంది. ఇంట్లో వాళ్లంతా కష్టపడేంత పనులు ఉంటాయి. కిలో గూళ్లకు రూ.50 అదనంగా ఇస్తామన్న ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదు. ప్రోత్సాహకాలు అంతంత మాత్రమే.
– ఈశ్వర్‌రెడ్డి, పట్టురైతు, టీఎస్ అగ్రహారం, పలమనేరు
ఇబ్బందులు ఉన్న మాట నిజమే..
గతంలో ఆయా ఏడీల పరిధిలో పథకాల అమలయ్యేవి. ఇప్పుడు సెంట్రలైజేషన్ కారణంగా స్టేట్ యూనిట్‌గా మారింది. దీంతో అన్ని పథకాలకు నగదు విడుదల ఆలస్యమవుతోంది. ఇక ఏఆర్‌ఎంలు పెట్టుకోవడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే యూనిట్‌ను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరూ రావడం లేదు. ఇక రైతులకు ఇన్సెంటివ్ ఆలస్యమవుతోంది. ఈ మధ్య కొంత రిలీజ్ అయినా అది ఇంకా రైతుల ఖాతాల్లోకి పడలేదు. – కిశోర్‌నాయక్, సిరికల్చర్ ఏడీ, పలమనేరు
●
Comments
Please login to add a commentAdd a comment