రొంపిచెర్ల: హైకోర్టు ఆదేశించినా తమను విధుల్లోకి తీసుకోలేదని సంఘమిత్రలు రొంపిచెర్ల సీ్త్రశక్తి భవనం ముందు గురువారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి తప్పు లేకున్నా తమను అన్యాయంగా తొలగించడంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయినా న్యాయం జరగకపోవడంతో హైకోర్టుకు వెళ్లామన్నారు. తప్పు లేకుండా సంఘమిత్రలను ఎలా తొలగిస్తారని, యథావిధిగా విధుల్లోకి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించినా న్యాయం జరగడం లేదని వాపోయారు. పది రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు కరుణించడం లేదన్నారు. రొంపిచెర్ల మండలంలో 14 మంది సంఘమిత్రలను తొలగించారని, తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘమిత్రలు గీత, రష్యా బేగం, ప్రమీల, ఉదయభాను, ధనలక్ష్మి, గీతారాణి, సుబ్బరత్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment