ఉమ్మడి చిత్తూరు జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్‌గా పెద్దిర
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్‌గా ఉన్న మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతి, చిత్తూరు జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గరురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పెద్దిరెడ్డికి రీజనల్ కో–ఆర్డినేటర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొంది.
స్టోర్‌కు చేరిన విద్యుత్ పరికరాలు
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా ట్రాన్స్‌కో స్టోర్స్‌కు విద్యుత్ పరికరాలు వచ్చిందని ఎస్‌ఈ సురేంద్రనాయుడు గురువారం తెలిపారు. 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లు 40, కండక్టర్ 168 కిలోమీటర్లు వచ్చిందన్నారు. వీటిని సీనియారిటీ వారీగా దరఖాస్తు చేసుకున్న వారికి, పరిశీలించి అందజేయాలని సూచించారు. ఏఈలు వర్క్‌ఆర్డర్లు పెట్టి మెటీరియల్స్ డ్రా చేసుకోవాలని వివరించారు.
నూతన కమిటీ ఎన్నిక
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)ల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పోరాడుదామని నూతన వీఆర్‌ఏ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోదండన్, దేవరాజు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవనంలో రెవెన్యూ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు హుస్సేన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. నూతన సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోదండన్, ప్రధాన కార్యదర్శిగా దేవరాజు, సహధ్యక్షుడిగా ఇర్ఫాన్ అలీ, గౌరవ అధ్యక్షుడిగా లక్ష్మన్, జిల్లా ఉపాధ్యక్షులుగా యాగమూర్తి, జయబదూరి, మంజుల, మాధవి, వాణి, జిల్లా ట్రెజరర్‌గా అశోక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న వీఆర్‌ఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
నాణ్యమైన విద్య అందించండి
రామకుప్పం: స్థానిక డా.బీ.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పారిశుద్ధ్యంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు నాణ్యమైన భోజనం వడ్డించాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. సకాలంలో విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు, సామగ్రిని అందజేయాలన్నారు. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించే దిశగా భోదన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదనపు గదులు కావాలని పాఠశాల ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, అవసరమైన సౌకర్యాలను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన రామకుప్పం సమీపంలోని ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో కుప్పం కడ ప్రత్యేక అధికారి వికాస్ మర్మత్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
రోడ్ల మరమ్మతులకు రూ.21.53 కోట్లు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో రోడ్ల మరమ్మతుల కోసం రూ.21.53 కోట్లు నిధులు విడుదల చేశారని ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. సంక్రాంతిలోపు రోడ్లపై గుంతలకు మరమ్మతు చేయనున్నట్లు చెప్పారు. చిత్తూరు నియోజకవర్గంలో 117 కిలోమీటర్లకు రూ.2.86 కోట్లు, పూతలపట్టులో 267 కి.మీ.కు, రూ.3.18 కోట్లు, జీడీనెల్లూరులో 301 కి.మీ.కు, రూ.4.08 కోట్లు, నగరిలో 147 కి.మీ.కు, రూ.2.88 కోట్లు, పలమనేరులో 224 కి.మీ.కు, రూ.2.05 కోట్లు, పుంగనూరు 107 కి.మీ.కు, రూ.2.65 కోట్లు, కుప్పం 547 కి.మీ, రూ.3.83 కోట్లు చొప్పున కేటాయించారన్నారు. మొత్తం 1646 కిలోమీటర్లకు, రూ.21.53 కోట్లతో గుంతలు పూడ్చనున్నట్లు చెప్పారు. వీటికి టెండర్లు పిలిచి పనులు అప్పగించనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment