ఎర్రచందనం పరిరక్షణకు కృషి చేయాలి
తిరుపతి మంగళం : అరుదైన, అత్యంత విలువైన ఎర్రచందనం పరిరక్షణకు అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా కృషి చేయాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) ఎస్‌ఎస్.శ్రీధర్ సూచించారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. శేషాచలంలోని ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఉందన్నారు. స్మగ్లర్లను నిలువరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కూంబింగ్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, చెక్ పోస్టులు పనితీరుపై చర్చించారు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయం గోడలు పెచ్చులు ఊడుతున్నాయని, స్మగ్లర్లను ఉంచేందుకు పట్టిష్ట గదులు అవసరమని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్లారు. సీసీఎఫ్ సె ల్వం, డీఎఫ్‌ఓ వివేక్, ఏసీఎఫ్ శ్రీనివాస్, టాస్క్‌ఫో ర్స్ డీఎస్పీ బాలిరెడ్డి, ఆర్‌ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐ సురేష్, ఎస్‌ఐ రఫీ, ఎఫ్‌ఆర్‌ఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment