పలమనేరు: ఏనుగులు అడవుల్లో నుంచి వచ్చి రైతుల పంటలను నాశనం చేయకుండా ఉండేందుకు అడవి అంచుల్లో కందకాలను తవ్వించనున్నట్టు ప్రభుత్వం తెలిపిందని, అయితే వీటితో ఏనుగులను కట్టడి చేయడం కష్టమేనని స్థానిక రైతుసంఘ నాయకుడు ఉమాపతి నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏనుగుల సమస్యపై ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేస్తున్న కృషి అభినందనీయమేనని, అయితే ఈ కందకాలను ఉపాధి కూలీల ద్వారా చేయడం కష్టమేనని తెలిపారు. పది అడుగుల లోతు పది అడుగుల వెడల్పు కందకాలను కిలోమీటర్ల మేర కూలీల ద్వారా చేస్తే అది ఎప్పటికి పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కౌండిన్యలో టీడీపీ హయాంలో జేసీబీలతో కాంట్రాక్టర్ల ద్వారా తవ్వించిన కందకాలను ఏనుగులు యథేచ్ఛగా పూడ్చివేసి నేరుగా పొలాల్లోకి వస్తున్నాయని తెలిపారు. కందకాల స్థానంలో బలమైన ఇనుప స్తంభాలను అమర్చి సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment