ముత్యాలమ్మ ఆలయంలో చోరీ
వెదురుకుప్పం: మండలంలోని పచ్చికాపల్లం సమీపంలోని పేట గ్రామం వద్ద ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి గుర్తు తెలియ ని వ్యక్తులు చొరబడి నగదు, బంగారం చోరీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామస్తుల కథనం మేరకు.. ముత్యాలమ్మ ఆలయంలోకి మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ముందు గేటు ద్వారా ప్రవేశించి ఆలయ ప్రధాన గేటుకు వేసిన తాళాలను పగులగొట్టి లోపలకు చొరబడ్డారు. ఆలయం లోపల ఉన్న బీరువాను ఇనుప రాడ్లతో ధ్వంసం చేసి, అందులోని రూ.5 వేలు నగదు, అమ్మవారి తాళిబొట్టుకు ఉన్న 3 గ్రాము ల బంగారాన్ని దొంగలించుకుపోయినట్లు చెబుతున్నారు. వీటితో పాటు ఆలయంలో ఉన్న 2 కామాక్షి దీపపు స్తంభాలను సైతం ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment