20 లీటర్ల సారా స్వాధీనం
పుంగనూరు: మండలంలోని పట్రపల్లెతండాలో సారా విక్రయిస్తున్న ఎం.చిన్నరెడ్డెప్ప నాయక్‌ను పట్టుకుని, అతని వద్ద నుంచి 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి సీఐ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ సారా తయారు చేస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు దాడులు చేశామన్నారు. అక్కడ సారా విక్రయిస్తున్న చిన్నరెడ్డెప్ప నాయక్‌ను పట్టుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు.
1600 లీటర్ల సారా ఊట ధ్వంసం
పుంగనూరు మండలంలోని పెద్దతండా, పట్రపల్లి తండాల్లో ఎకై ్సజ్ అధికారులు దాడులు జరిపి 1600 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. బుధవారం ఎకై ్సజ్ సీఐ సురేష్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ జవహర్‌బాబు, ఎస్‌ఐ వేణుగోపాల్‌రెడ్డి, సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సారా తయారీ కోసం నిల్వ చేసిన సారా ఊటను ధ్వంసం చేశారు.
10 లీటర్ల సారా స్వాధీనం
కార్వేటినగరం: అక్రమంగా ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేసినట్లు శ్రీరంగరాజపురం ఎస్‌ఐ సుమన్ తెలిపారు. బుధవారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిందితుల అరెస్టు చూపించారు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ మండల పరిధిలోని చిన్నతయ్యూరు గ్రామానికి చెందిన పృథ్వీరాజ్, శేషాద్రి, యూఎం పురం గ్రామానికి చెందిన రామ్మూర్తి కలసి బైక్‌లో సారా తరలిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు పుల్లూరు క్రాస్ వద్ద కాపు కాచి వారి బైక్‌ను ఆపి తనిఖీ చేయగా 10 లీటర్ల సారా పట్టుబడిందన్నారు. సారాతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment