చిత్తూరు అర్బన్: స్కూటర్ చోరీ చేసిన కేసులో ఈశ్వర్ అనే నిందితుడికి ఆరు నెలల జైలు విక్ష విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. వివరాలు ఇలా.. బంగారుపాళ్యం మండలం బండ్లదొడ్డి గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి ఇంట్లో ఈ ఏడాది జూలై 12వ తేదీన బైక్ చోరీకి గురైంది. దగ్గువారిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ వాహనం చోరీ చేశాడని తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ మేరకు పూర్వాపరాలను పరిశీలించి నిందితుడికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment