క్రిస్మస్ హై టీ
చిత్తూరు కలెక్టరేట్ : క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారికంగా క్రిస్మస్ హైటీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మైనారిటీలకు సంక్షేమ భవనం ఏర్పాటు చేస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను తాము పాఠశాల స్థాయిలోనే జరుపుకునే వారమని తెలిపారు. మైనారిటీలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సంతోషానికి ప్రతీకగా క్రిస్మస్ ట్రీని ప్రారంభించి కొవ్వొ త్తులు వెలిగించారు. కార్యక్రమంలో నగర మేయర్ అముద, చుడా చైర్మన్ హేమలత, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డీఆర్‌వో మోహన్‌కుమార్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment