జనవరి 22 నుంచి నాక్ బృందం పర్యటన
కుప్పం: ద్రావిడ వర్సిటీలో నాక్ బృందం జనవరి 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు పర్యటించనుంది. ఈ మేరకు సోమవారం న్యాక్ కార్యాలయం నుంచి వర్సిటీ అధికారులకు సమాచారం అందింది. ఇదివరకే 2018లో వర్సిటీ నాక్ ‘బి’ గ్రేడును సాధించింది. తాజాగా నాక్ గ్రేడింగ్ కోసం ద్రవిడ వర్సిటీ అధికారులు నాక్‌కు వర్సిటీ ఎస్‌ఎస్‌ఆర్ (సెల్ప్ స్టడీ రిపోర్టు)ను సమర్పించారు. ఇప్పటికే వర్సిటీలో భవనాలకు పెయింటింగ్, కొత్త బోర్డులు, హోర్డింగులతో పాటు వర్సిటీని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సారైనా వర్సిటీకి ‘ఏ’ గ్రేడును సాధిస్తే, అభివృద్ధి పథంలో నడుస్తుందని వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది ఆశిస్తున్నారు.
సెలవుల్లేవ్
జనవరిలో నాక్ బృందం పర్యటన ఉన్నందున వర్సిటీలోని బోధన, బోధనేతర సిబ్బంది ఎలాంటి సెలవులు పెట్టకూడదని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వర్సిటీ భవితవ్యం నాక్ గ్రేడింగుపై ఆధారపడి ఉన్నందున కేవలం సంక్రాంతి సెలవులు మాత్రమే తీసుకోవచ్చని చెప్పారు. అలా కాకుండా మరొక్క రోజు కూడా అదనంగా సెలవులు పెట్టకూడదని స్పష్టం చేశారు. వర్సిటీకి నాక్ ‘ఏ’ గ్రేడును సాధించేందుకు ప్రతి ఒక్క ఉద్యోగి కష్టపడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment