గత ఆరు నెలలుగా జిల్లాలో వ్యాపారాలు ఆశించినంత మేర జరక్కపోవడంతో దుకాణాలు దివాలా తీస్తున్నాయి.
జిల్లాలో ఉండే నిరక్షరాస్యులైన మహిళల్లో అక్షర వెలుగులు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అక్టోబర్‌లో ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం మొదట్లో ఒక సమావేశం నిర్వహించి ఆయా శాఖ అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఉల్లాస్ కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక, సామాజిక, డిజిటల్ అక్షరాస్యతపై మహిళలకు తరగతులు నిర్వహించాల్సి ఉంది. బ్యాంకు ఖాతాలున్న వారికి వాటి నిర్వహణ తీరుపై అవగాహన కల్పించడమే ఉల్లాస్ ముఖ్య ఉద్దేశం. క్షేత్రస్థాయిలో అమలు తీరు సరిగ్గా లేకపోవడంతో మహిళల్లో అక్షర వెలుగుల జాడ కానరాలేదు. ఇకనైనా అధికారులు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– 8లో
మహిళల్లో
జాడలేని
అక్షర
వెలుగులు
Comments
Please login to add a commentAdd a comment