నడకతోనే ఆరోగ్యం
చిత్తూరు కార్పొరేషన్: నిత్య జీవితంలో నడకతోనే ఆరోగ్యం కలుగుతుందని డీఎఫ్‌వో భరణి తెలిపారు. ప్రతి ఒక్కరూ నడక సాగించాలని పిలుపునిచ్చారు. చిత్తూరులోని నగరవనంలో ఆదివారం వాక్‌థాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కష్టంగా మారిందన్నారు. మనకంటూ రోజూ కొంత సమయాన్ని కేటాయించుకుని శారీరక శ్రమ చేయాలన్నారు. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం 40, ఆపై ఏళ్ల వారికి వేర్వేరుగా 3 కే, 5కే రన్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన 12 మందికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో థామస్, వాకర్స్ అసోసియేషన్ నాయకుడు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment