కార్యకర్త కుటుంబానికి ఓదార్పు
నగరి: మున్సిపాలిటీ కరకంఠాపురం దళితవాడలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త అన్బు ఆదివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. మాజీ మంత్రి ఆర్కే రోజా సోదరులు వై.కుమారస్వామి రెడ్డి అతని స్వగృహానికి చేరుకుని మృతదేహంపై పూలదండలు ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
పలువురికి ఏఈలుగా ఉద్యోగోన్నతి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా ట్రాన్స్‌కో పరిధిలో పలువురికి సబ్‌ఇంజినీర్ నుంచి ఏఈలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలసముద్రం సబ్ ఇంజినీర్ లోకేష్‌రెడ్డి, మిట్టూరు సెక్షన్ నుంచి శివకుమార్, బంగారుపాళ్యం సెక్షన్ నుంచి ప్రసన్న, పుంగనూరు డివిజన్ కార్యాలయం నుంచి ప్రసాద్, ఉమామహేశ్వర్లుకు ఉద్యోగోన్నతి లభించింది. వీరికి త్వరలో స్థానాలు కేటాయించనున్నారు.
గరుడ గమనా రారా..!
చంద్రగిరి : తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. తిరుపతికి చెందిన శ్రీరాధిక కూచిపూడి నృత్యాలయ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అదివో అల్లదివో, ఘల్లు ఘల్లు, వస్తావ జానకి, జాజిరి జాజిరి, కోయిలారే, శ్రీలలితా హారతి, గరుడ గమనా రారా, ఓ పిల్లడా ఎంకటేశా తదితర పాటలకు కళాకారులు పావని, గీతిక, కోమలశ్రీ, చరిష్మ, గౌరవి, జస్మిత, హేమశ్రీ, షణ్ముఖ ప్రియ, భవ్య, రిత్విక, భవిష్య అభినయించిన హావభావాలు మంత్రముగ్ధం చేశాయి. కళాకారులను ఏవో ఖాదర్‌వలీ సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment