మొగిలి ఘాట్‌లో లారీ బోల్తా
● క్లీనర్ మృతి ● డ్రైవర్‌కు తీవ్రగాయాలు
బంగారుపాళెం : మండలంలోని మొగిలి ఘాట్‌లోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం లారీ బోల్తాపడడంతో క్లీనర్ మృతి చెందాడు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్‌ఐ మల్లప్ప కథనం మేరకు.. బెంగళూరు నుంచి చైన్నెకి సిలికాన్ ఇసుక తరలిస్తున్న లారీ మొగిలి ఘాట్‌లో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ రాజస్తాన్‌లోని నింబాడ్‌కు చెందిన సోనూ(35), పతావ్‌ఘడ్‌కు చెందిన లారీ డ్రైవర్ అనీల్‌మీనా(37) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, వాహనదారులు ఇసుకను తొలగించి క్లీనర్‌ను బయటకు తీశారు. అనంతరం ఇద్దరినీ బంగారుపాళెం ఆస్పత్రికి తరలించారు. క్లీనర్ సోనూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయనడిన డ్రైవర్‌ను మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment