పథకం ప్రకారం గోబెల్స్ ప్రచారం
● డైవర్సన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు నాయుడు దిట్ట ● పెద్దిరెడ్డిపై ప్రభుత్వం కుట్ర ● హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం ● మండిపడిన విజయానందరెడ్డి
చిత్తూరు కార్పొరేషన్: చంద్రబాబు పథకం ప్రకారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గోబెల్స్ ప్రచారానికి తెరతీశారని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటగా ఎల్లో మీడియాలో వార్తలు రాయించడం, వాటిపై టీడీపీ నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టడం ఆనవాయితీగా మారిందన్నారు. దానిపై ఏదో తప్పు జరిగిందని ప్రభుత్వం విచారణ పేరిట హడావుడి చేయడం వంటివి పథకం ప్రకారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పెద్దిరెడ్డిపై అటవీ భూముల కబ్జా కూడా ఆ కోవకు చెందిందే అని తెలిపారు. దానిపై ఆయన న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించిన విషయం గుర్తుచేశారు. దశాబ్దాలుగా ఆ భూమిపై వారి కుటుంబానికి ఉన్న హక్కు, అది ఎలా సంక్రమించిందో వివరంగా మీడియా సమావేశంలో తెలియజేశారన్నారు. ఈ అంశం పై ఎలాంటి విచారణకై నా సిద్ధమని సృష్టం చేశారన్నారు. గొర్రెల మందలాగా టీడీపీ నాయకులు చెప్పిందే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. హామీల అమలు చేతకాక ప్రతి నెలా ఏదో ఒక విషయంపై విపరీత ప్రచారం చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. నాడు చంద్రబాబు డెయిరీ కోసం చిత్తూరు జిల్లాలోని పాడి రైతుల కల్పతరువు విజయా డెయిరీని పథకం ప్రకారం దివాలా తీయించారన్నారు. కానీ అదే ప్రాంతంలో అమూల్ లాంటి దిగ్గజ సంస్థను జగనన్న హయాంలో తీసుకొచ్చారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment