వీధి బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో వీధి బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని లిటిల్ ప్లవర్ పాఠశాలలో వీధి బాలల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సమగ్రశిక్ష శాఖ ఆధ్వర్యంలో వీధిబాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. బడి మానేసిన పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. వీధి బాలలను గుర్తించి వారిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమగ్రశిక్ష శాఖ పరిధిలో ఎన్‌జీఓల ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఆవాస్ యోజన పథకంలో ప్రత్యేక వీధిబాలల వసతి గృహం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకే పాఠశాల పరిధిలో బడిమానేసిన పిల్లలు 20 మంది ఉంటే వారికి ప్రత్యేక విద్యావాలంటీర్‌తో శిక్షణ ఇప్పిస్తామన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి భా రతి మాట్లాడుతూ.. బాలల హక్కులను సంరక్షించాల న్నారు. తెలిసీ తెలియని వయస్సులో ఇళ్ల నుంచి వె ళ్లిపోయి వీధి బాలలుగా మారి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. కార్మిక శాఖ, పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ సంస్థ అధికారుల బృందాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరీ మాట్లాడుతూ.. వీధి బాలలను గుర్తించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో దిశ డీఎస్పీ విజయశేఖరరాజు, ఎస్‌ఐ నాగ సౌజన్య, జిల్లా బాలల సంరక్షణ అధికారి సుబ్రహ్మణ్యం, డీవైఈవో చంద్రశేఖర్, సెక్టోరల్ అధికారులు నరోత్తమరెడ్డి, ఉదయలక్ష్మి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment