ఎరువుల విక్రయ దస్త్రాలు గల్లంతు
– ఎరువుల అమ్మకం నిలుపుదలకు ఆదేశం
ఐరాల : మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో ఎరువులకు సంబంధించిన సరైన రికార్డులు చూపకపోవడంతో 12.350 ఎంటీఎస్ ఎరువులు అమ్మకం నిలుపుదల చేస్తు పుంగనూరు ఏడీఏ శివకుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక సింగిల్ విండోను ఏడీఏ, ఏఓ వరలక్ష్మి, తవణంపల్లె ఎంఏఓ ప్రవీణ్‌తో కలిసి సింగిల్ విండో కార్యాలయంలో ఎరువుల రికార్డులను తనిఖీ చేశారు. తనిఖీలో ఎరువులకు సంబంధించిన కొన్ని రికార్డులను సిబ్బంది చూపకపోవడంతో రూ.1,58,100 విలువ చేసే ఎరువుల విక్రయం నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. డీలర్లు ప్రతి రోజూ స్టాక్, ఎంఆర్‌పీ సూచించే బోర్డులు దుకాణాల వద్ద ప్రదర్శించాలని సూచించారు. అధిక ధరలకు ఎరువుల విక్రయించరాదని సూచించారు. డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే లైసైన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment