No Headline
ఎన్నికల ముందు నుంచి మద్యం ప్రియులనే టీడీపీ టార్గెట్ చేసింది. భారీగా ధరలు
తగ్గిస్తామని ఊదరగొట్టింది. తీరా అధికారం చేపట్టాక కూటమి ప్రభుత్వం రూ.100కే మద్యం అంటూ జబ్బలు చరిచింది. ఏడాది కూడా గడవక ముందే కల్తీ మద్యానికి బాటలు వేసింది. ఇదే అదునుగా నకిలీ ముఠా రెచ్చిపోయింది. పేదల బ్రాండ్లుగా గుర్తింపు పొందిన రూ.100, రూ.130 మద్యాన్ని కల్తీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. తిరుపతి సమీపంలోని దామినేడులో
పట్టుబడిన కల్తీ మద్యం ముఠాను చూస్తే ఇదే
అర్థమవుతోంది. తాము సేవించే మద్యాన్ని కల్తీ చేస్తున్నారేమోనని మద్యం ప్రియుల్లో భయాందోళన మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment