కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ప్రియులను లక్ష్యంగా చేసుకుని విచ్చలవిడిగా విక్రయాలు పెంచింది. తక్కువ ధరకే మద్యం అని చెప్పి చీప్ లిక్కర్‌ని విక్రయించడానికి శ్రీకారం చుట్టింది. విక్రయాలను భారీగా పెంచేందుకు బెల్టు దుకాణాలను తీసుకొచ్చింది. కూటమి నేతల కనుసన్నల్లో గ్రామ గ్రామాన, వీధి వీధిన ఈ బెల్టు దుకాణాలు వెలిశాయి. ఈ దుకాణాలు నిర్వహించే వారు పది రూపాయలు ఆదాయం కోసం ఏ బ్రాండ్ తక్కువ ధరకు వస్తే.. ఆ బ్రాండ్‌నే కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. బెల్టు దుకాణాలపై ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో వారికి అడ్డే లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో కల్తీ మద్యం ఎక్కువగా బెల్టు దుకాణాలకే చేరినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment