● దామినేడులో భారీగా కల్తీ మద్యం స్వాధీనం ● రూ.100, రూ.1
సాక్షి టాస్క్‌ఫోర్స్: కల్తీ మద్యం వెలుగు చూడడంతో మద్యం ప్రియులు షాక్‌కు గురయ్యారు. విచ్చలవిడి మద్యం వెనుక కల్తీ ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధర అని చెప్పి కల్తీ మద్యాన్ని అంటగడుతున్నారా..?అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి సమీపంలోని దామినేడు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం కల్తీ మద్యం ముఠా గుట్టురట్టు కావడంతో భయంతో వణికిపోతున్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందోనని..? పలువురు ఆరా తీసే పనిలో పడిపోయారు.
మద్యం దుకాణాల్లో కూడానా?
నకిలీ మద్యం కేవలం బెల్టు షాపులకే సరఫరా చేస్తున్నారా? లేక మద్యం దుకాణాలకూ పంపిణీ చేస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది. పోటీపడి టెండర్లు దక్కించుకున్న కొందరు మద్యం వ్యాపారులు పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడానికి నకిలీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నకిలీ మద్యాన్ని ఒకరిద్దరే కొనుగోలు చేస్తున్నారా? ఎక్కువ మంది తీసుకెళ్తున్నారా? అనేదానిపై విచారణ చేపట్టాల్సి ఉంది.
ఇంకా ఎక్కడెక్కడున్నాయో?
కూటమి ప్రభుత్వం వచ్చాకే ఈ నకిలీ మద్యం తయారీ ముఠా తెరపైకి వచ్చింది. అంతకుముందు ఇటువంటి ఘటనలు లేవని అధికారులు చెబుతున్నారు. ఈ నకిలీ ముఠా కేవలం దామినేడు వద్దే కాకుండా.. మరిన్ని చోట్ల తయారు చేస్తున్నట్టు ఎకై ్సజ్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం దామినేడు వద్దే భారీ ఎత్తున నకిలీ మద్యం దొరికితే.. మిగిలిన చోట్ల ఇంకెంత నకిలీ మద్యం లభ్యవుతుందోనని మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
నకిలీ మద్యం ఇస్తారా?
దామినేడు వద్ద దొరికిన నకిలీ మద్యం విషయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దావాణంలో వ్యాపించింది. ఎన్నికలకు ముందు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరపరా చేస్తామని హామీ ఇచ్చిన కూటమి పెద్దలు.. నకిలీ మద్యాన్ని తక్కువ ధరకు ఇచ్చి తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా? అంటూ మద్యం ప్రియులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నకిలీ మద్యం తయారీ వెనుక ఎవరి ప్రమేయం ఉంది? ఇందుకు సహకరించిన వారెవరు? ఈ నకిలీ మద్యాన్ని ఎప్పటి నుంచి ఎక్కడెక్కడికి సరఫరా చేశారు? అనే విషయాలు వెల్లడించాలని మద్యం ప్రియాలు డిమాండ్ చేస్తున్నారు.
నకిలీ మద్యం బాటిళ్ల తయారీకి ఉపయో
గించిన పరికరాలు
ఆ బ్రాండ్లే టార్గెట్
కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ఏరులై పారిస్తోంది. ఎక్కడ చూసినా బెల్టుషాపులు, అనధికారిక దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తోంది. ఇందులో పేదలు అధికంగా సేవించే రూ.100, రూ.130 రకాల బ్రాండ్లు ఒకరోజు ఉన్న టేస్ట్ మరో రోజు లేదని మద్యం ప్రియులు చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం దామినేడులో పట్టుబడిన కల్తీ మద్యంలో ఎక్కువగా పేదలు తాగే బ్రాండ్లే ఉండడం దీనికి మరింత బలం చేకూరుతోంది. స్వాధీనం చేసుకున్న లేబుళ్లన్నీ రాయల్ క్యాన్ విస్కీ, ట్రాపికానా బ్రాందీ, హనీబీ బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా, నైసీ హార్స్, సెలబ్రిటీ చాయిస్ కంపెనీలకు చెందినవే ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment