రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పిల్లల తల్లి సుబ్బనరసమ్మ
తన పసికందులను తానే గొంతునులిమి చంపినట్లు తల్లి సుబ్బనరసమ్మ కన్నీటిపర్యంతమయ్యింది. అనంతరం తాను ఈగల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆవేదన చెందింది. భర్తతో ఉన్న మనస్ఫర్థలే ఈ దారుణానికి దారి తీశాయని, తనను ఎందుకు బతికించారని? బిడ్డల వద్దకే పంపించండి అంటూ రోదించింది. రిమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతూ కోలుకున్న అనంతరం సుబ్బనరసమ్మ అన్న మాటలు ఇవీ..
కడప అర్బన్/పెండ్లిమర్రి: జిల్లాలోని పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన సుబ్బనరసమ్మ బిడ్డలను మొదట గొంతునులిమి, తరువాత తాను ఈగల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఈఘటనతో విషాదఛాయలు అలుముకున్న విషయం తెలిసిందే. ముగ్గురు చిన్నారులు మృతిచెందగా, తల్లి సుబ్బనర్సమ్మ కడప రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. కోలుకున్న ఆమె శుక్రవారం మాట్లాడుతూ తన భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా తాను, బిడ్డలు బతకకూడదని నిర్ణయించుకున్నామన్నారు.
ఈక్రమంలో మొదట బిడ్డలను వరుసగా గొంతునులిమేశానని, తాను ఈగల మందు తాగానని కంటతడిపెట్టింది. బిడ్డలు మరణించారని తెలిసిందని, తనను వారి దగ్గరికి తీసుకుని వెళ్లాలని రోదించింది. కాగా పసికందుల మృతదేహాలను మార్చురీకి తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. పెండ్లిమర్రి మండలం నుంచి వచ్చిన బంధువులు, స్థానిక ప్రజలు పిల్లల మృతదేహాలను చూసి చలించిపోయారు.
తల్లిపై హత్య కేసు నమోదు:
పిల్లలు సుబ్బరాయుడు(3), కుమార్తె సుబ్బరత్న(2), బాబు(రెండునెలలు) లను గొంతునులిమి హత్య చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సుబ్బనర్సమ్మపై హత్య కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పెండ్లిమర్రి ఎస్‌ఐ ఆర్‌వి కొండారెడ్డి శుక్రవారం ఇక్కడి విలేకర్లకు తెలియజేశారు. పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించామన్నారు.
చదవండి:
మమ్మల్నెందుకు చంపావమ్మా.!
హత్య కేసు: గుర్తు తెలిపిన తాళం చెవి
Comments
Please login to add a commentAdd a comment