టెక్ మహేంద్రలో ఉద్యోగం..
త్వరలో అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు
వైరారూరల్: అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తాగునీటి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. వైరా మండలంలోని నారపునేనిపల్లిలో మంగళవారం చోటు చేసుకున్న ఈఘటన వివరాలు... గ్రామానికి చెందిన దావూలూరి కిరణ్‌కుమార్ – ప్రసన్న దంపతుల మొదటి కుమార్తె వర్షిత అలియాస్ వందన(23)కు అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఎరుకోపాడు బండి గోపితో వివాహాం జరిగింది.
పెళ్లయిన నాలుగు రోజులకే గోపి అమెరికా వెళ్లిపోగా, వర్షిత హైదరాబాద్‌లోని టెక్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగిగా చేరింది. కొంత కాలంగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెకు నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులు హైదరాబాద్‌లో చికిత్స చేయించి నారపునేనిపలి్లకి తీసుకొచ్చారు. అయితే, సోమవారం రాత్రి వర్షితకు కడుపు నొప్పితీవ్రం కావడంతో ఇంటి ఆవరణలోని తాగునీటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
మంగళవారం ఉదయం వర్షిత కోసం తల్లిదండ్రులు వెతుకుతుండగా బావిపై చెక్క పక్కకు జరిపి ఉండడంతో పరిశీలించగా ఆమె మృతదేహం కనపడింది. ఘటనపై ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో తహసీల్దార్ కే.వీ.శ్రీనివాసరావు, ఎస్సై వంశీకృష్ణ చేరుకుని పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, వర్షిత అమెరికా ప్రయాణానికి వీసా ఏర్పాట్లలో ఉండగా బలవన్మరణానికి పాల్పడడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment