జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఛారిష్మ
అంబాజీపేట: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) నిర్వహించనున్న బాస్కెట్‌బాల్ అండర్–17 జాతీయ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు అంబాజీపేటకు చెందిన నిమ్మకాయల ఛారిష్మ సాయి రుత్వి ఎంపికైంది. అంబాజీపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఛారిష్మ ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆ పోటీల్లో తూర్పు గోదావరి జిల్లా జట్టు మూడో స్థానంలో నిలవగా, జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఛారిష్మ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం కడలి సాయిరాం, పీడీ కె.ఆదిలక్ష్మి తెలిపారు. త్వరలో తమిళనాడులో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొనుంది. ఛారిష్మ ఎస్‌జేఎఫ్ తరఫున గతంలో అండర్–14 విభాగంలో రెండుసార్లు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. సబ్ జూనియర్స్ విభాగంలో సైతం రాష్ట్రజట్టుకు ఎంపికై పుదుచ్చేరిలో జరిగిన జాతీయ పోటీల్లో పాల్గొంది. వాలీబాల్‌లో సైతం రాణిస్తూ సబ్ జూనియర్స్ విభాగంలో ఉమ్మడి తూర్పు గోదావరి జట్టుకు ఎంపికై ంది. జాతీయ పోటీలకు ఎంపికై న ఛారిష్మను జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, డీఈఓ సలీం బాషా, డీవైఈఓ మధుసూదనరావు, ఎస్‌ఎంసీ చైర్మన్ పితాని త్రిమూర్తులు, పీఈటీ ఎ.సూర్యకుమారి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment