కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు
అల్లవరం: కూటమి ప్రభుత్వంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు అధికమయ్యాయని, దీనిపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జాతీయ మానవ హక్కుల సంఘానికి మంగళవారం ఫిర్యాదు చేశామని మాజీ ఎంపీ చింతా అనురాధ బుధవారం తెలిపారు. న్యూ ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ విజయభారతి, జాతీయ మహిళా కమిషన్ కార్యదర్శి మీనాక్షిని కలసి మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఫిర్యాదు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 77 మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. అక్రమ మద్యం, ఇసుక దందా జరుగుతున్నా, ఆడబిడ్డలకు రక్షణ లేకపోయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మహిళల కోసం ఏర్పాటైన దిశ చట్టాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎంపీలు గురుమూర్తి, తనుజారాణి, మాజీ ఎంపీ జి.మాధవిలతో కలసి ఫిర్యాదు చేశామని అనురాధ వివరించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ, జాతీయ మహిళా కమిషన్ సానుకూలంగా స్పందించిందన్నారు.
వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్ డే
పరేడ్‌కు గైట్ విద్యార్థిని
రాజానగరం: ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 12 నుంచి 21 వరకు జరిగే ప్రీ రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆంధ్రా యూనివర్సిటీ తరఫున గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ ఫర్జానా ఆష్మీ మొహ్మద్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ ధనరాజ్ తెలిపారు. కేబీసీ నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ(జలగావ్)లో జాతీయ స్థాయిలో ఈ పరేడ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment