బడులకు ముందే వచ్చిన పండగ | - | Sakshi
Sakshi News home page

బడులకు ముందే వచ్చిన పండగ

Published Fri, Jan 10 2025 2:47 AM | Last Updated on Fri, Jan 10 2025 2:47 AM

బడులక

బడులకు ముందే వచ్చిన పండగ

రాయవరం: జిల్లావ్యాప్తంగా 22 మండలాల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో భోగిదండలను మంటల్లో వేయించి మన సంస్కృతి, సంప్రదాయాలను ఉపాధ్యాయులు వారికి పరిచయం చేశారు. రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మను పూలతో అలంకరించి విద్యార్థులు గొబ్బెమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. విద్యార్థులకు నిర్వహించిన రంగవల్లుల పోటీలో పలువురు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాలలో హరిదాసు హడావుడి, అయ్యగారికి దండం పెట్టు అంటూ డూడూ బసవన్న చేసిన ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ప్రభలను అలంకరించి, భోగిమంటలు వేసి, రంగవల్లులు తీర్చిదిద్ది, పిండి వంటలు తయారు చేసి సంక్రాంతి పర్వదినాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. జిల్లావ్యాప్తంగా 1,584 పాఠశాలల్లో ఈ వేడుకలు నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారులు, ఎస్‌ఎంసీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో డీఈవో డాక్టర్‌ షేక్‌ సలీం బాషా పాల్గొన్నారు.

నేటి నుంచి సెలవులు

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమవుతాయి. క్రిస్టియన్‌, మైనార్టీ పాఠశాలలకు మాత్రం ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఈ పాఠశాలలు 16వ తేదీ నుంచి పనిచేస్తాయి. అయితే హైస్కూల్‌ ఫ్లస్‌లు (జూనియర్‌ కళాశాలలు) తరగతులు శుక్రవారం పనిచేస్తాయి.

ఇంటర్‌ విద్యార్థులకు రేపటి నుంచి..

అమలాపురం టౌన్‌: ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖాధికారి (డీఐఈవో) వనుము సోమశేఖరరావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కళాశాలలకు 11 నుంచే సెలవులు అమలు అవుతున్నట్లు పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలలకు సంక్రాంతి సెలవులు శుక్రవారం నుంచి ఇస్తున్నారని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు దగ్గరలో ఉన్న ఉన్నత పాఠశాలల నుంచి మధ్యాహ్న భోజనం సరఫరా అవుతోందని డీఐఈవో గుర్తు చేశారు. అయితే ఆ రోజు ఇంటర్మీడియెట్‌ విద్యార్ధులకు మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో

సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలు

గొబ్బిపాటలు పాడి,

రంగవల్లులు వేసిన చిన్నారులు

నేటి నుంచి సంక్రాంతి సెలవులు

No comments yet. Be the first to comment!
Add a comment
బడులకు ముందే వచ్చిన పండగ1
1/1

బడులకు ముందే వచ్చిన పండగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement