టీటీడీ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
● మృతుల కుటుంబాలకు
రూ.కోటి పరిహారం ఇవ్వాలి
● టీటీడీ పాలక మండలి
మాజీ సభ్యుడు పొన్నాడ
తాళ్లరేవు: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన నీలపల్లిలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్నడూలేని విధంగా టీటీడీలో ఘోరమైన సంఘటన జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే దేవస్థానంలో ఇలా జరగడం దారుణమన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించడంతోపాటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారికి పూర్తిగా వైద్యం అందించి నష్ట పరిహారం అందజేయాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సతీష్‌కుమార్ చేశారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవిందకుమార్, నాయకులు దడాల జగదీశ్వరరావు, పెట్ల సూర్యనారాయణ రాజు, కట్టా దుర్గారావు, పలివెల రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment