పరీక్షా కాలం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పరీక్షా కాలం మొదలైంది. వార్షిక పరీక్షల్లో భాగంగా సోమవారం ఎన్విరాన్‌మెంట్ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో గుర్తింపు పొందిన కళాశాలల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరిగే ఈ పరీక్షకు ఫస్టియర్ విద్యార్థులు 22,260 మంది హాజరు కానున్నారు. మానవీయ విలువలు, పర్యావరణ విద్య వంటి అంశాల్లో విద్యార్థులకు ఏమేరకు అవగాహన ఉందో తెలుసుకునేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరూ ఈ పరీక్ష రాయాల్సిందేనని ఇంటర్ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష ప్రారంభానికి ముందు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల ఈ–మెయిల్‌కు ప్రశ్నపత్రం నేరుగా పంపించనున్నారు. ప్రిన్సిపాల్ సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష నిర్వహించాలి.
నిఘా నీడలో ప్రాక్టికల్స్
ఇదిలా ఉండగా ఈ నెల 5 నుంచి ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు, 10 నుంచి జనరల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 89 కేంద్రాల్లో 21,871 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రతి కేంద్రంలో నిఘాకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మరోవైపు మార్చి 1 నుంచి వార్షిక (థియరీ) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 146 కళాశాలల్లో మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న 44,131 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.
ఫ ఇంటర్ విద్యార్థులకు
నేడు ఎన్విరాన్‌మెంట్ పరీక్ష
ఫ 5 నుంచి ప్రాక్టికల్స్
ఫ మార్చి 1 నుండి వార్షిక పరీక్షలు
పక్కాగా పర్యవేక్షణ
ఇంటర్ పరీక్షలు పక్కాగా నిర్వ హించేందుకు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ బాధ్యత తీసుకోవాలి. ఎలాంటి పొరపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదు.
– జీజీకే నూకరాజు, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment