రాజ్యాంగమే మనకు శిరోధార్యం
ఏలూరు (టూటౌన్): భారత రాజ్యాంగమే మనకు శిరోధార్యమని రాజ్యాంగ ధర్మ పరిషత్తు ఫౌండర్, జాతీయ కన్వీనర్ ఫ్రొఫెసర్ ఎన్ఏడీ పాల్, ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ అన్నారు. స్థానిక నరసింహారావుపేట నందలి ఏఐఏవైఎస్ అండ్ ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రజలందరూ ఘనంగా జరుపుకోవాలని కోరారు. మత, కుల, వర్గ వర్ణ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఆరోజున స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ఉదయం 10.30 గంటలకు బైక్ ర్యాలీ, అనంతరం ఇండోర్ స్టేడియం ఎదురుగా ఉన్న లేడీస్ క్లబ్ నందు రాజ్యాంగం తెలుగు అనువాద పుస్తకావిష్కరణ చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీఆర్పీఎస్ నాయకులు పులవర్తి డేవిడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment