గణతంత్రం.. సమైక్య సంకల్పం
గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న కలెక్టర్
వందేమాతరం అంటూ..
ఏలూరు (మెట్రో) : జిల్లావ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవాలు అంబరాన్నంటాయి. సమైక్యత భా వాన్ని చాటుతూ మువ్వెన్నల జెండాలు రెపరెపలాడాయి. ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో కలెక్టర్ కె.వెట్రిసెల్వి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లానుద్దేశించి మాట్లాడారు. జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికాభివృద్ధిని కృషిచేస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లాలో 13,435 ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పారు. జిల్లా, మండల అధికారులు జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 3.32 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఆయిల్‌పామ్, కోకో సాగులో దేశంలోనే జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. జిల్లాలో రోడ్ల పరిస్థితిని మెరుగుపరుస్తున్నామని చెప్పారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా ఎస్పీ కె.ప్రతాప శివ కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఎఫ్‌ఓ శుభం, ఎస్పీ కె.ప్రతాప శివకిషోర్, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, నూజివీడు సబ్‌కలెక్టర్ బి.స్మరణ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్టాల్స్.. శకటాలు
ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 19,860 సంఘా ల్లోని 1,73,054 మంది సభ్యులకు రూ.1,268.46 కోట్ల రుణాలను అందజేశారు. దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు అందజేశారు. ఉద్యాన శాఖ, డీఆర్‌డీఏ–మెప్మా, మత్స్యశాఖ స్టాల్స్ మొదటి మూడు బహుమతులు పొందాయి. అలాగే ప్రభు త్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నా యి. వ్యవసాయ, విద్యాశాఖ శకటాలకు ప్రథమ, విద్యుత్ పంపిణీ శకటానికి ద్వితీయ, పోలవరం ప్రాజెక్టు నమూనా, పౌరసరఫరాల శాఖ శకటాలకు తృతీయ బహుమతులు లభించాయి.
ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
ఏలూరులో కలెక్టర్ పతాకావిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment