దేశ సమైక్యతకు పాటుపడాలి
ఏలూరు టౌన్: దేశ స్వాతంత్య్రం కోసం అ సువులు బాసిన సమరయోధులకు ప్రతిఒక్క రూ నివాళులర్పించాలని, దేశ సమైక్యతకు పాటుపడాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ఏలూరులోని రేంజ్ కార్యాలయంలో ఆదివారం రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. ఆయన జాతీయ జెండాను ఆ విష్కరించి, దేశ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ఏలూరులోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. జేసీ ధాత్రి రెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు.
ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలి
ఏలూరు (టూటౌన్): రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఉద్యోగులు పనిచేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఎం.సునీల్‌కుమార్ పిలు పునిచ్చారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో న్యాయవాదులు విశేష కృషి చేయాలని, తద్వారా సమాజం అభివృద్ధి వైపు నడుస్తుందని సూచించారు. ప్రతి వ్యక్తి సొంత లాభాన్ని కొంత త్యాగం చేసి సమాజాభివృద్ధికి పా టుపడాలని కోరారు. రెండో అదనపు జిల్లా జడ్జి పి. మంగాకుమారి, ఐదో అదనపు జిల్లా జడ్జి జి.రాజేశ్వరి, పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి ఎస్.ఉమా సునంద, డీఎల్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి కె.రత్నప్రసాద్, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఏపీపీ కోనే సీతారామారావు, ప్రభుత్వ న్యాయవాది బీజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏకగ్రీవంగా ట్రెజరీ ఎన్నికలు
ఏలూరు(మెట్రో) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖజానా శాఖ ఉద్యోగుల సంఘ కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. శనివారం ఏ లూరు జిల్లా ఖజానా కార్యాలయంలో ఎన్నిక లు నిర్వహించగా ప్రెసిడెంట్‌గా యూవీ పాండురంగారావు, సెక్రటరీగా కప్పల సత్యనారా యణ, ట్రెజరర్‌గా ఎల్.వెంకటేష్, అసోసియే ట్ ప్రెసిడెంట్‌గా ఎం.మధుసూదనరావు, వైస్ ప్రెసిడెంట్‌లుగా పి.హరిబాబు, ఎ.శ్రీనివాసరావు, యు.రాజేష్‌కుమార్, ఎ.రమ కిరణ్మయి, జాయింట్ సెక్రటరీలుగా బి.నరసింహరావు, విద్యాసాగర్, డి.వరలక్ష్మిని ఎన్నుకున్నారు. జిల్లా ఏపీఎన్‌జీఓ సంఘ అధ్యక్షుడు చో డగిరి శ్రీనివాస్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment