ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళం
ఏలూరు (టూటౌన్) : కేంద్రంలోని మోడీ ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఏలూరులో రైతులు, కార్మికులు కదం తొక్కారు. రిపబ్లిక్ డే సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా–కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా ఆదివారం పాత బస్టాండ్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వసంతమహల్ సెంటర్ వరకు ప్రదర్శన చేపట్టారు. కార్మిక హక్కులు హరించే నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, వ్యవసాయ కార్పొరేటీకరణ విధానాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (అన్నే భవనం) రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (స్ఫూర్తి భవనం) రాష్ట్ర కార్యదర్శి డి.ప్రభాకర్, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment