వరుస చోరీలకు పాల్పడుతున్న యువకుడి అరెస్ట్
తెనాలి రూరల్: డిగ్రీ చదివిన యువకుడు కారు డ్రైవరుగా పని చేస్తూ చెడు వ్యసనాలకు బానిసై దొంగగా మారాడు. తెనాలి బాలాజీరావుపేటలో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌న్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వివరాలను సీఐ ఎస్. రమేష్ బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం... విజయవాడ కొత్తపేటలోని నెహ్రూ బొమ్మ సెంటర్‌కు చెందిన గుదే హరీష్‌కుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్నాడు. గతంలో విజయవాడ, ఏలూరులో చోరీలకు పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ క్రమంలో తెనాలి బాలాజీరావుపేట కిరాయి కోసం వచ్చినప్పుడు అతడు తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేస్తున్నాడు. బాలాజీరావుపేటలోనే ఏడాది వ్యవధిలో ఐదు దొంగతనాలకు పాల్పడ్డాడు. తాళం వేసి ఉన్న ఇంటి వెనుక తలుపును పగులగొట్టి లోనికి ప్రవేశించాక బీరువా, కబోర్డుల తాళం చెవులు వెతికేవాడు. దొరికితే వాటితో ఓపెన్ చేసి.. ఆభరణాలను తస్కరించేవాడు. విజయవాడలో తెలిసిన వ్యక్తి ద్వారా ఆభరణాలను గవర్నర్‌పేటలో బంగారం నాణ్యత పరీక్షించే షాపులకు విక్రయించాడు. ఆ డబ్బుతో గోవాలో జల్సాలు చేసేవాడు. తిరిగి వచ్చాక డబ్బులు అవసరమైనప్పుడల్లా రైలులో తెనాలి రావడం స్టేషన్‌కు వచ్చేవాడు. సమీపంలోని బాలాజీరావుపేటలో చోరీ చేసి, తిరిగి రైలెక్కి విజయవాడ వెళ్లిపోతున్నాడు. ప్రత్యేక బృందం విజయవాడ వెళ్లి నిందితుడి కదలికలపై నిఘా ఉంచింది. చివరకు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తే.. వరుస చోరీల వ్యవహారం బయటపడింది. అతడి నుంచి సుమారు రూ. 7.10 లక్షల విలువైన బంగారు నగలు, రూ. 40 వేల విలువ చేసే వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో మరికొందరిని అరెస్టు చేసి, మరింత బంగారం స్వాధీనం చేసుకోవాల్సి ఉందని సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న ఎస్‌ఐ ఎ్. ప్రకాశరావు, ఏఎస్‌ఐ ఎస్‌కే హైదర్ అలీ, కానిస్టేబుళ్లు పి.మురళి, ఎస్. జైకర్ బాబులను అభినందించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు బీరువా, ఇతర కబోర్డుల తాళం చెవులు ఇంట్లో ఉంచవద్దని సూచించారు. లాక్డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టం(ఎల్‌హెచ్‌ఎంఎస్) తెనాలి పోలీసుల వద్ద అందుబాటులో ఉందని, దానిని వినియోగించుకోవాలని సీఐ సూచించారు.
రూ. 7.50 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment