రెండవ రోజు విజృంభించిన ఆంధ్ర క్రికెట్ జట్టు
మంగళగిరి: నగర పరిధిలోని నవులూరు అమరావతి టౌన్‌షిప్‌లో ఉన్న ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కూచ్ బెహరా ట్రోఫీ అండర్ –19 మ్యాచ్‌లో రెండవ రోజు ఆంధ్ర బ్యాటర్ల విజృంభణతో జట్టు 615 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 315 పరుగుల తొలి రోజు స్కోర్‌తో రెండవ రోజు గురువారం ఆట ప్రారంభించిన జట్టు 65 ఓవర్లలో 300 పరుగులు చేసింది. మొత్తం 155 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 615 పరుగులు సాధించింది. రెండవ రోజు జట్టు బ్యాట్స్‌మెన్ ఏవీఎన్ లోహిత్ 121 బంతులలో 3 సిక్స్‌లు, 7 ఫోర్లతో 100 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. కె.రేవంత్ 163 బంతులలో 3 సిక్స్‌లు రెండు ఫోర్లతో 72 పరుగులు, టి వరుణ్ సాత్విక్ 135 బంతులలో 8 ఫోర్లతో 68 పరుగులతో రాణించారు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్ ఆర్ నౌనిలాల్ 5 వికెట్లతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన హిమాచల్ ప్రదేశ్ జట్టు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 25 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసింది.
సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన ఏఎన్‌వీ లోహిత్ 615 పరుగుల భారీ స్కోర్ సాధించిన ఆంధ్ర జట్టు
Comments
Please login to add a commentAdd a comment