ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు
మంగళగిరి: ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు అని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. మండలంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటిలో గురువారం సెల్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా కంపెనీతో కలిసి ఈ వేస్ట్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. దృశ్యమాధ్యమ పద్ధతిలో వీడీయో సందేశాన్ని కలెక్టర్ పంపారు. గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు సమస్యను పరిష్కరించడంలో ముందుకు రావాలన్నారు. ఒప్పో ఇండియా కంపెనీ ప్రజావ్యవహారాల విభాగాధిపతి రాకేష్ భరద్వాజ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సెల్‌ఫోన్ల తయారీలో రెండవ స్థానంలో ఉన్నా భారత్‌లో ఈ వేస్ట్ సైక్లింగ్‌లో వెనుకబడి ఉన్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 50 మిలియన్ల టన్నులు ఈ వేస్ట్ పేరుకుపోతోందని, దీనిని ఎప్పటికపుడు తగ్గించకపోతే పర్యావరణానికి ప్రమాదం తప్పదన్నారు. ఇన్‌చార్జి వీసీ భరద్వాజ్ శివకుమారన్, డీన్ డాక్టర్ సివీ టామి, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ రంగభాష్యం, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డెబ్లినా దత్తా తదితరులు పాల్గొన్నారు.
యువతలో అవగాహన పెరగాలి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పిలుపు
Comments
Please login to add a commentAdd a comment