‘పచ్చ’ ఖాకీల దాష్టీకం
పట్నంబజారు: రెడ్‌బుక్ రాజ్యాంగంలోని పేజీలు ఒక్కొక్కటిగా తిరుగుతూనే ఉన్నాయి.. అక్రమ అరెస్ట్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. కూటమి కుట్రలు నిలదీస్తే ఖాకీల లాఠీ వేటు పడుతోంది.. అన్యాయాన్ని ఎదిరిస్తే.. అక్రమ కేసులతో నోరు మూయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను అరెస్ట్ చేస్తూ.. అక్రమ నిర్బంధాలకు తెరదీస్తూ.. పోలీసులు సైతం పచ్చచొక్కాలు వేసుకున్న కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. కనీసం మహిళ అని చూడకుండా. అర్ధరాత్రి ఒక మహిళను స్టేషన్‌లో ఉంచకూడదన్న కనీస విషయాన్ని మరిచిన కర్కశపు ఖాకీలు.. వారి స్వామి భక్తిని చాటుకున్నారు.
అక్రమ కేసుల పరంపర..
సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారనే నెపంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు, సానుభూతిపరుల అక్రమ అరెస్ట్‌ల పర్వానికి కూటమి ప్రభుత్వం తెరదీసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఇప్పటీకే మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ గుంటూరు సోషల్ మీడియా అధ్యక్షుడు మేకా వెంకట్రామిరెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో మూడు కేసులు, మంగళగిరి రూరల్‌లో ఒకటి, గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో ఒక కేసు నమోదు చేసి అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించారు. వైజాగ్‌కు చెందిన ఇంటూరి రవికిరణ్ సీఎం చంద్రబాబుపై ఏదో పోస్ట్ పెట్టారనే నెపంతో.. వర్ల రామయ్య ఫిర్యాదు మేరకు గుడివాడ కోర్టుకు హాజరైన అతనికి 41 నోటీసులు జారీ చేశారు. గత కొద్ది రోజుల క్రితం అరండల్‌పేట పోలీసుస్టేషన్ విచారణ నిమిత్తం హాజరయ్యారు. తిరిగి ఈ నెల 15 తేదీన విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.
● తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం వల్లాభాపురం గ్రామానికి చెందిన ఆళ్ల జగదీష్‌రెడ్డి, 2018లో చంద్రబాబుపై పోస్టింగ్ పెట్టారనే నెపంతో, తెనాలి త్రీ టౌన్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేయటంతో, కొల్లిపర పీఎస్‌లో కేసు కట్టారు. విజయవాడ సైబర్ క్రైం పోలీసుల ద్వారా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే జగదీష్‌రెడ్డికి 41 నోటీసులు జారీ చేశారు. సైబర్ పోలీ సులు మాత్రం ఒకటికి పలుమార్లు విచారణ నిమి త్తం రమ్మంటూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
సుధారాణి దంపతులకు నరకం చూపించి..
నా బిడ్డలు ఎక్కడ ఉన్నారో తెలియటంలేదు.. ఐదు రోజుల పాటు నన్ను, నా భర్తను అక్రమంగా అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారు.. చిలకలూరిపేట సీఐ రమేష్ మహిళనని కూడా చూడకుండా నన్ను తీవ్రం కొట్టాడు.. నా భర్తను నానా దుర్భాషలాడారంటూ.. పెద్దిరెడ్డి సుధారాణి సాక్ష్యాత్తూ న్యాయమూర్తి ఎదుట ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేటకు చెందిన వెంకటరెడ్డి, సుధారాణి దంపతులు. నల్గొండ జిల్లాలో నివాసం ఉంటున్నారు. సిరిసిల్ల సమీపంలోని బొజ్జమ్మ తల్లి ఆలయంలో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్న వెంకటరెడ్డి వద్దకు సుధారాణి వెళ్లారు. భార్యభర్తలిద్దరూ.. వారి ఇద్దరి పిల్లలతో ఈ నెల 5వ తేదీన కలిసి జొన్నవాడలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లిన క్రమంలో చిలకలూరిపేట సీఐ రమేష్, మరో ఏడుగురితో కూడి బృందంతో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు జీపులోకి ఎక్కించుకుని బలవంతంగా చిలకలూరిపేటకు తరిలించారు. అక్కడ ప్రత్యక్ష నరకాన్ని చూపించి.. తరువాత ఒంగోలు తరలించారు. అక్కడ సైతం ఆమైపె వేధింపుల పర్వం ఆగలేదు. అక్కడ కూడా తమ ఇద్దరిని తీవ్రంగా కొట్టారని ఆమె న్యాయమూర్తికే స్వయంగా చెప్పారు. పోస్టింగ్ పెట్టింది సుధారాణి అయితే.. భర్త వెంకటరెడ్డి పోస్టింగ్‌కు సహకరించారని అక్రమ కేసు బనాయించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు సుధారాణి కనీసం నడవలేని పరిస్థితుల్లో.. చేతులు నల్ల రక్తపు గడ్డలు ఉండటం ప్రతి ఒక్కరినీ ఎంతో బాధకు గురి చేసింది. వైఎస్సార్ సీపీ న్యాయవాదులు వారి జాడ తెలియకపోవటంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయటంతో, కొత్తపేట పోలీసులు ఈ నెల 8 తేదీ ఉదయం 3గంటల సమయంలో ఒంగోలు నుంచి తీసుకుని వచ్చి హడావుడి అరెస్ట్ చూపించారు. ఈ క్రమంలో ఒకే పోస్టింగ్‌కు సంబంధించి సుధారాణిపై ఆరు పోలీసుస్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయంటే.. కూటమి దమనకాండ అర్ధమవుతుంది.
కేసు వెంట కేసు పెట్టేందుకు సిద్ధం..
గత ప్రభుత్వం పని చేయలేదని అంటున్నారు.. ఇదిగో ఈ శాఖలు మీ దగ్గరే ఉన్నాయి కదా..? ఇప్పుడు మీరు చేయటానికి ఇబ్బంది ఏంటీ అని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి సామాజిక మాధ్యమాల్లో అడిగిన ప్రశ్నలు. వీటికే కూటమి నేతల మనోభావాలు దెబ్బతినేశాయి. అత్యంత ఘోరంగా వ్యాఖ్యలు చేశారని.. పునుగుపాటి ఆంజనేయులు అనే టీడీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హరికృష్ణారెడ్డిని అక్రమంగా బంధించారు. స్టేషన్‌లో ఒక రాత్రంతా ఉంచి.. అరెస్ట్ చేసి కోర్టుకు శుక్రవారం హాజరుపరిచారు. అయితే హరికృష్ణారెడ్డికి బెయిల్ వస్తే.. తిరిగి మరో కేసులో అదుపులోకి తీసుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని సమాచారం. అప్పటికే స్టేషన్ బయట భారీగా పోలీసు బలగాలను మొహరించారు. తిరిగి మిగతా స్టేషన్‌లలో ఉన్న కేసుల్లో అరెస్ట్ చేసేందుకు పోలీసులు పన్నాగం పన్నారనేది బహిరంగ రహస్యమే. కూటమి నేతలు.. వారికి చెప్పు చేతల్లో నడుస్తున్న ఖాకీల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భావస్వేచ్ఛను సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తే.. ఇటువంటి అక్రమ అరెస్ట్‌లకు తెరదీస్తారా.. అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
కొనసాగుతున్న అక్రమ అరెస్ట్‌ల పరంపర నేరుగా దౌర్జన్యానికిపాల్పడుతున్న ఖాకీలు ఐదు రోజులు సుధారాణికి నరకం చూపించిన చిలకలూరిపేట సీఐ రమేష్ న్యాయమూర్తి ఎదుటే వాగ్మూలం ఇచ్చిన బాధితురాలు తనను, తన భర్త వెంకటరెడ్డిని దుర్భాషలాడటంతో పాటు, తీవ్రంగా కొట్టారని వాపోయిన వైనం కళ్లం హరికృష్ణారెడ్డిపై మరిన్ని కేసులకు సన్నద్ధమైన పోలీసులు..?
Comments
Please login to add a commentAdd a comment