ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శివాలయం సోమవారం శివ నామస్మరణతో మార్మోగింది. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తిక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని దీపాలు వెలిగించి, పూజలు చేసేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా ఎటు చూసినా కార్తిక దీపాలు వెలిగించే భక్తులే కనిపించారు. తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి ప్రారంభమైంది. ఆలయ ఆవరణలో కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
– పెదకాకాని
Comments
Please login to add a commentAdd a comment