సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించను
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించనని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రజలు అందించే అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని, సమస్యల పరిష్కారంలో నిర్లిప్తత ఉండకూడదని అధికారులకు తెలిపారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి అర్జీలు వెళితే సంబంధిత అధికారికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీ పెట్టుకునే హక్కు ప్రజలకు ఉంటుందని, వాటిని సక్రమంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. కొందరు వాటిని తూతూమంత్రంగా పరిష్కరించి అర్జీదారునికి తెలియకుండా క్లోజ్ చేస్తున్నారని, వారిపై చర్యలకు వెనుకాడమని తెలిపారు. అనంతరం వచ్చిన 166 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment