No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Nov 26 2024 1:56 AM | Last Updated on Tue, Nov 26 2024 1:56 AM

No He

No Headline

నెహ్రూనగర్‌: గుంటూరు నగరవాసులకు ట్రాఫిక్‌ తిప్పలు తలనొప్పిగా మారింది. రైల్వే ట్రాక్‌ ఎక్స్‌టెన్షన్‌ (విస్తరణ) పనుల నిమిత్తం మూడు వంతెనల(డొంక రోడ్డు) వద్ద సోమవారం నుంచి రాకపోకలు నిలిపివేశారు. దీంతో నగర ప్రజలు సంజీవయ్యనగర్‌, నెహ్రూనగర్‌ రైల్వేగేటు, శంకర్‌విలాస్‌ బ్రిడ్జి మీదుగా వన్‌ టౌన్‌ నుంచి టూ టౌన్‌కి, టూ టౌన్‌ నుంచి వన్‌ టౌన్‌కి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే, ఇక్కడే ట్రాఫిక్‌ సమస్య మరింత జటిలమైంది. వందలాది వాహనాలు రాకపోకలు సాగించడంతో ట్రాఫిక్‌ చక్రబంధంలో నగర ప్రజలు గంటల కొద్దీ ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొంత మంది ట్రాఫిక్‌ దెబ్బకు భయపడి వాహనాలను గేటు అవతల, ఇవతలకు పార్కు చేసుకుని నడుచుకుంటూ వెళ్లి పనులను చక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

రైల్వే గేటులతో తిప్పలు

అరండల్‌పేట, బ్రాడీపేట, లక్ష్మీపురం, శ్రీనగర్‌ నుంచి మూడు వంతెనల మీదుగా రాకపోకలు సాగించే వారు సంజీవయ్యనగర్‌, నెహ్రూనగర్‌ రైల్వే గేటుల మీదుగా కొత్తపేట, ఆర్టీసీ బస్టాండ్‌, వన్‌ టౌన్‌లోకి ప్రవేశిస్తున్నారు. అయితే, ప్రతి ఐదు నిమిషాలకొకసారి రైల్వే గేటు పడటంతో వాహనదారులు గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా వాహనాలే కన్పిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి కూడా చిన్న ఖాళీ కూడా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకోసారి గేటు మధ్యలోనే వాహనాలు నిలిచిపోవడంతో రైలు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా గేట్‌ మేన్‌లు, పోలీసులు దగ్గరుండి వాహనాల ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

అరవై రోజులూ కష్టాలే

రెడ్డిపాలెం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి సంజీవయ్యనగర్‌ రైల్వే గేటు మీదుగా నెహ్రూనగర్‌, కొత్తపేటలోని పలు ప్రైవేట్‌ పాఠశాలలకు విద్యార్థులు వెళుతుంటారు. అయితే, ఉదయం ట్రాఫిక్‌ రద్దీ పెరిగిపోవడంతో ట్రాఫిక్‌ చక్ర బంధంలో ఇరుక్కుపోతున్నారు. కొన్ని పాఠశాలల నిర్వాహకులు ట్రాఫిక్‌ సమస్యను తెలుసుకుని స్కూల్‌ గేటు క్లోజ్‌ చేసే సమయాన్ని కొంత మేరకు పెంచారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విధులకు హాజరయ్యే ఉద్యోగులు రైల్వే గేటుల వద్ద గంటల తరబడి నిరిక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. అటు శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి మీద కూడా ట్రాఫిక్‌ చుక్కలు చూపిస్తోంది. హిందూ కాలేజీ సిగ్నల్స్‌ నుంచి ఇటు లాడ్జిసెంటర్‌ వరకు ట్రాఫిక్‌ చక్రబంధంలో ఇరుక్కుపోతున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన రైల్వే పనులను పూర్తి చేసి ట్రాఫిక్‌ కష్టాలు తీర్చాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.

నగరవాసులకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్‌ మూడు వంతెనల వద్ద రాకపోకల నిలిపివేత సంజీవయ్యనగర్‌, నెహ్రూనగర్‌ రైల్వే గేటు, శంకర్‌విలాస్‌ బ్రిడ్జిపై భారీగా నిలిచిపోతున్న వాహనాలు గంటల కొద్దీ ట్రాఫిక్‌ ఇక్కట్లు చక్రబంధంలో ఇరుక్కుపోతున్న వాహనదారులు, పాదచారులు విద్యార్థులు, ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/1

No Headline

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement