అర్జీలు పెండింగ్ ఉండొద్దు
గుంటూరు వెస్ట్: ప్రజల నుంచి వచ్చే అర్జీలను పెండింగ్ ఉంచొద్దని, వాటిని వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శాఖలోనూ పెండింగ్ అర్జీ ఉండకూడదన్నారు. పరిష్కారానికి వీలుకాని వాటిని అర్జీదారుడికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. తమ అర్జీలను ప్రజలు స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చన్నారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయన్నారు. ప్రజలు అందించే అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లిప్తత ఉండకూడదని తెలిపారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి అర్జీలు వెళితే సంబంధిత అధికారికి మెమో జారీ చేయాలన్నారు. అనంతరం వచ్చిన 155 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికార్లి ఎం.గంగరాజు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.
బాధ్యత ముఖ్యం
ప్రభుత్వ ఉద్యోగమంటే కేవలం ఉపాధి మాత్రమే కాదని, అంతకు మించిన బాధ్యతగా గుర్తించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ముగ్గురికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
బ్యాటరీ వాహనం ఇప్పించండి
నేను దివ్యాంగుడిని. ఎలక్ట్రీషియన్‌గా జీవనం సాగిస్తున్నా. నాకు ఇటీవల కుడి భుజంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ట్రై సైకిల్‌ను చేతితో తోయలేకపోతున్నా. బ్యాటరీ ట్రై సైకిల్ ఇప్పించండి.
– ఎం.గణేష్, నల్లచెరువు
మూడు నెలలైనా పట్టించుకోరా
వరదల వల్ల నష్టపోయిన సుమారు 200 కుటుంబాలు నష్టపరిహారం కోసం మూడు నెలల నుంచి తిరుగుతున్నాం. సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. న్యాయం చేయండి.
– కె.జయసుధ, విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు
అధికారులకు కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశం గ్రీవెన్స్‌లో అర్జీల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment