మెటీరియల్‌ ‘టెన్‌’షన్‌! | - | Sakshi
Sakshi News home page

మెటీరియల్‌ ‘టెన్‌’షన్‌!

Published Tue, Dec 24 2024 1:47 AM | Last Updated on Tue, Dec 24 2024 1:46 AM

మెటీరియల్‌ ‘టెన్‌’షన్‌!

మెటీరియల్‌ ‘టెన్‌’షన్‌!

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సకాలంలో స్టడీ మెటీరియల్‌ అందించడంలో జెడ్పీ పాలకవర్గం, అధికార యంత్రాంగం విఫలమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న సీనియర్‌ ఉపాధ్యాయులతో అధిక మార్కుల సాధనకు దోహదం చేసేలా రూపొందించిన మెటీరియల్‌ను విద్యాశాఖాధికారులు గత నవంబర్‌ 2న జెడ్పీ పాలకవర్గానికి అందజేసినా, ఇప్పటికీ కనీసం ముద్రణకు నోచుకోలేని దుస్థితి నెలకొంది. స్టడీ మెటీరియల్‌ పంపిణీలో నెలకొన్న జాప్యంపై ఇటు పాలకవర్గం, అటు అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

వైఎస్‌ జగన్‌ పాలనలో రెండేళ్లపాటు నిరాటంకంగా..

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వరుసగా రెండేళ్లు ‘జగనన్న విద్యాజ్యోతి’ పేరుతో స్టడీ మెటీరియల్‌ రూపొందించి సకాలంలో పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన జెడ్పీ పాలకవర్గం కూటమి ప్రభుత్వ పాలనలో తొలి ఏడాదే చతికిలబడింది. 2022 నవంబరులో రూ.61.80 లక్షల జెడ్పీ నిధులతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 36,155 మందికి స్టడీ మెటీరియల్‌ అందించారు. 2023లోనూ రూ.70 లక్షలతో 39వేల మందికి మెటీరియల్‌ ఇచ్చారు. ప్రస్తుతం టెన్త్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న 35వేల మందికి రూ.70 లక్షలతో మెటీరియల్‌ పంపిణీకి గత జెడ్పీ సర్వసభ్య సమావేశంలోనే నిర్ణయించినా ఆచరణలోకి రాలేదు. మార్చి 17 నుంచి టెన్త్‌ పరీక్షలు జరుగుతాయి. విద్యాశాఖ మెటీరియల్‌ను నవంబర్‌ 2న జెడ్పీకి అందించినా ముద్రణ చేయించడంలో జెడ్పీ పాలకవర్గం, అధికార యంత్రాంగం విఫలమయ్యాయి.

పదో తరగతి విద్యార్థులకు ఇంకా అందని స్టడీ మెటీరియల్‌ డిసెంబర్‌ ముగుస్తున్నా చలనం లేని పాలకులు, అధికారులు 2022లో రాష్ట్రంలోనే తొలిసారిగా జగనన్న విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్‌ పంపిణీ ఈసారీ నవంబర్‌ 2న జెడ్పీకి మెటీరియల్‌ అందజేసిన విద్యాశాఖ టెండర్ల ఖరారు, ముద్రణలో జెడ్పీ పాలకుల తీవ్ర నిర్లక్ష్యం

గత రెండేళ్లు మెటీరియల్‌ పంపిణీ ఇలా..

సంవత్సరం అందుకున్న ఖర్చుచేసిన

విద్యార్థులు మొత్తం(రూ.లక్షల్లో)

2022 36,155 61.80

2023 39,000 70.00

విద్యార్థులు నష్టపోతున్నారు

టెన్త్‌ విద్యార్థులకు డిసెంబర్‌ 15లోపు స్టడీ మెటీరియల్‌ ఇస్తామని హామీ ఇచ్చిన జెడ్పీ పాలకవర్గం, అధికారులు ఆచరణలో విఫలమయ్యారు. జనవరిలో ఇచ్చినా, స్టడీ మెటీరియల్‌ ఆధారంగా పరీక్షలకు సన్నద్ధం కావడం విద్యార్థులకు సాధ్యపడదు. వెంటనే ఇచ్చే ఏర్పాట్లుచేయాలి.

– కేఎస్‌ లక్ష్మణరావు, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement